- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు గుడ్ న్యూస్ : ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు
రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్‌ను డిక్లేర్ చేసింది. 2023-24 విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది.
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు ఎస్ఏ-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.21 నుంచి 24వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నారు. వచ్చేనెల 25న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. విద్యార్థుల మార్కులు చెప్పి, సెలవులు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా వచ్చేనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
Next Story






