గురుకులాల్లో ఆకట్టుకుంటున్న సమ్మర్ క్యాంప్స్

by Ajay Maddhiboyina |

విద్యార్థులలో కళలు, పలు సృజనాత్మక అంశాల్లో తర్పీదునిచ్చేందుకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్

గురుకులాల్లో ఆకట్టుకుంటున్న సమ్మర్ క్యాంప్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులలో కళలు, పలు సృజనాత్మక అంశాల్లో తర్పీదునిచ్చేందుకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తన్న సమ్మర్​క్యాంపులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్​లోని ఉప్పల్ బాలుర గురుకుల కాలేజీ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ ​మండలం ఎదులాబాద్​లోని గర్ల్ ఫైన్ ఆర్ట్స్ స్కూలులో 8, 9వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు.

ఏప్రిల్​22న‌ ఆరంభమైన ఈ సమ్మర్ క్యాంప్ లో స్టూడెంట్స్​కు ​తొమ్మిది రకాల ఈవెంట్స్ పై స్పెషల్​ ట్రైయింగ్ ఇస్తున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్యాంపును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చేరియల్ పెయింటింగ్, పట్టరీ-చేతితో మట్టి శిల్ప కళ, కార్టూన్ డ్రాయింగ్- పాత్రలు, కథలతో స్కెచ్, బంజారా ఎంబ్రాయిడరీ, ప్రకృతి పరిశోధన అంశాలలో స్టూడెంట్స్​ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే, ఆదివారం ఎదులాబాద్​లోని గర్ల్ ఫైన్ ఆర్ట్స్ స్కూలులో కొనసాగుతున్న క్యాంప్​ను టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలగు వర్షిణి సందర్శరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మర్ క్యాంప్స్​ వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులకు విద్యాబోధన, నైపుణ్యాభివృద్ధితోపాటుగా వారి భవిష్యత్తుకు దోహదపడుతాయని ఆమె తెలిపారు.

Next Story