- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారిన వాతావరణం.. తెలుగురాష్ట్రాల్లో భీకరగాలులతో కూడిన వర్షం
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భీకరమైన గాలులకు చెట్లు విరిగి పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్, యాదాద్రి జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్, కృష్ణా, రాజమండ్రి, అల్లూరి జిల్లాల్లో ఇది పరిస్థితి నెలకొంది. మరో రెండు గంటల్లో భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని, గంటసమయంపాటు ఈదురుగాలులు వీస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకి రావొద్దని హెచ్చరించారు. అలాగే నల్గొండ, సూర్యాపేట, ములుగు, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని సూచించారు.
Next Story






