- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సబ్సిడీ విత్తనాల పంపిణీ రచ్చరచ్చ.. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి Vs PACS డైరెక్టర్
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా ఇవాళ జనగామ జిల్లా దేవరుప్పుల రైతువేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలోనే ఎమ్మెల్యే యశస్వినీరెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం జరిగితే తాను ఊరుకునేది లేదని, ఎక్కడికక్కడే నిలదిస్తామని వేదికపై ఉన్న ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా తాను ఇలానే వ్యవహిస్తానని కృష్ణమూర్తి గౌడ్ అనడంతో యశస్వినీరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఆమె వెంటనే కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. అనంతరం నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. అనంతరం అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.






