TG: ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) గవర్నింగ్ బాడీ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్ బాబు(Sridhar Babu), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)లు పాల్గొన్నారు.

TG: ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) గవర్నింగ్ బాడీ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్ బాబు(Sridhar Babu), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గత 10 ఏళ్లుగా పాలన చేసిన పాలకులు MCRHRD ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇకనుండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. MCRHRD‌ను దేశంలోనే ఉత్తమ శిక్షణ సంస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార యంత్రాంగం శక్తివంతం కావాలి, అందుకు అధికారి స్థాయి శిక్షణ కీలకమని పేర్కొన్నారు. స్వయం సమృద్ధి మరియు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వీలుగా సంస్థను అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ప్రపంచ స్థాయి శిక్షణా ప్రమాణాలకు అనుగుణంగా, అధికారులకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూనైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేసే స్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు జిల్లా, మండల స్థాయిలో రెండు రోజుల శిక్షణా శిబిరాలు నిర్వహించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేలా చేయాలని చెప్పారు. MCRHRD సంస్థ పనితీరు, శిక్షణా కార్యక్రమాల పురోగతి వంటి అంశాల పైన MCRHRD డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Next Story