- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ నిర్వహించాలి.. మైనారిటీ శాఖ మంత్రికి ఎస్టీయూటీఎస్ విజ్ఞప్తి
by Kema Shiva Kumar |
తెలంగాణలోని ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ నిర్వహించాలని మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌కు ఎస్టీయూటీఎస్ (STUTS) నేతలు విజ్ఞప్తి చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ నిర్వహించాలని మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ ఎస్టీయూటీఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో మైనారిటీ శాఖ మంత్రిని, ఎస్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సదానందం గౌడ్, జుట్టు గజేందర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు యం.పర్వత్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు మంత్రిని ఆహ్వానించారు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉండటంతో విద్యా బోధనకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. సమస్యపై సానుకూలంగా స్పందించి, తగిన హామీ ఇచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
Next Story






