HYD Police: అర్ధరాత్రి ఫ్లైఓవర్‌పై స్టంట్స్.. వీడియోలు వైరల్.. పోలీసులకు చిక్కిన ఆకతాయిలు

by Ramesh Naini |

హైదరాబాద్ పరిధిలోని (Aramghar flyover) ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి రాత్రి కొంతమంది యువకులు స్కూటీలపై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేశారు.

HYD Police: అర్ధరాత్రి ఫ్లైఓవర్‌పై స్టంట్స్.. వీడియోలు వైరల్.. పోలీసులకు చిక్కిన ఆకతాయిలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పరిధిలోని (Aramghar flyover) ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి రాత్రి కొంతమంది యువకులు స్కూటీలపై ప్రమాదకరంగా (stunts) స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఓ వైపు ప్రమాదకరంగా విన్యాసాలు చేయడమే కాకుండా.. మరోవైపు రీల్స్ వీడియోలు తీసుకుంటూ యువకులు హంగామా చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్‌లు (Hyderabad Police) హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆకతాయిలు పోలీసుల చేతికి చిక్కారు. స్టంట్స్ చేసిన ముగ్గురు మైనర్లతో పాటు మరో ముగ్గురికి (Bahadurpura Police) బహదూర్‌పురా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని పంపినట్లు తెలుస్తోంది. గతంలోనూ నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్‌లపై స్టంట్స్ చేస్తూ దొరికిన ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవడం, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నా.. కొంత మంది పోకిరీలు మాత్రం స్టంట్స్ చేస్తూనే ఉన్నారు.

Next Story