విద్యార్థులతో వెట్టి చాకిరీ పనులు

by velandi.Saikiran |   (  Updated:2026-03-20 17:51:20  IST  )

విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో హాస్టల్ వార్డెన్ ఇసుక తట్టలు మోపించడం మంచిర్యాల‌ జిల్లాలో చర్చనీయాంశమైంది.

విద్యార్థులతో వెట్టి చాకిరీ పనులు
X

విద్యార్థులతో వెట్టి చాకిరీ పనులు

విద్యార్థులతో ఇసుక మోపిస్తున్న హాస్టల్ వార్డెన్

వీడియో తీసి గ్రూపులో షేర్ చేసిన స్థానికులు

విచారణ చేపట్టిన అధికారులు

దిశ, మంచిర్యాల: విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో హాస్టల్ వార్డెన్ ఇసుక తట్టలు మోపించడం మంచిర్యాల‌ జిల్లాలో చర్చనీయాంశమైంది. శుక్రవారం హాస్టల్ విద్యార్థులు ఇసుక తట్టలు మోస్తున్న దృశ్యాలను, స్థానికులు వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. మంచిర్యాల జిల్లా సాయి కుంటలోని ఇంటిగ్రేటెడ్ బాలుర వసతిగృహం విద్యార్థులతో హాస్టల్ వార్డెన్ కు సన్నిహితుడైన ఓ నాయకుడు హాస్టల్ దగ్గరలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు సమాచారం.

అయితే ఇసుకను మోసేందుకు హాస్టల్ వార్డెన్ తో నాయకుడు దారుణానికి పాల్ప‌డ్డారు. విద్యార్థులతో ఇసుక తట్టలు మోపించారు. ఈ దృశ్యాలను వీడియోలు తీసి స్థానికులు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ చేశారు. ఆ వీడియోలు ప్రస్తుతం వైర‌ల్ గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు, వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం కాస్త జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతోహాస్టల్ కు వెళ్లి అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

సాయి కుంటలోని ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం దగ్గర ఓ నాయకుడు చేపట్టిన ఇంటి నిర్మాణం కోసం వార్డెన్ విద్యార్థులతో ఇసుకను మోపించడం పై ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థి నాయ‌కులు. వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story