- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాల దాడి కలకలం.. వీడియో వైరల్
హన్మకొండలో ఓ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాల దాడి వీడియో కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హన్మకొండలో ఓ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాల దాడి వీడియో కలకలం రేపుతోంది. హన్మకొండ జిల్లా కేంద్రంలోని స్మైల్ డీజీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై విద్యార్థి సంఘాల నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కొంత మంది విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. సంఘ నాయకులు చందాల పేరుతో స్కూలుకు వచ్చి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగిన తర్వాత దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నట్లు ట్రస్మా ప్రతినిధులు ప్రకటించారు. వారు స్కూల్ యాజమాన్యంపై జరిగే ఇలాంటి దాడులను కఠినంగా ఖండిస్తూ, ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో ఇదే..






