- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోస్టల్ బ్యాలెట్‌పై గందరగోళం.. సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన STU లీడర్స్
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు పోస్టల్ బ్యాలెట్‌పై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను ఎస్టీయూ నేతలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు పోస్టల్ బ్యాలెట్‌పై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను ఎస్టీయూ నేతలు కలిశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో అధికారుల వైఖరిపై ఫిర్యాదు చేశారు. కొందరు రిటర్నింగ్ అధికారులు కావాలని జాప్యం చేస్తున్నారని.. అందువల్ల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 2 వరకు ఓటు వేసే అవకాశం కల్పించడంతో పాటు డిసెంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించాలని కోరారు.
కాగా, ఎన్నికల విధుల్లో 3.03 లక్షల మంది ఉద్యోగులు ఉంటే.. ఇప్పటి వరకు 1.68 లక్షల మందికే పోస్టల్ బ్యాలెట్ అనుమతి ఇచ్చారని అందులోనూ చాలా మందికి ఇంకా బ్యాలెట్లు అందలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అందువల్ల పోస్టల్ బ్యాలెట్ విషయంలో తలెత్తిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు.






