- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యంత పకడ్బందీగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత పకడ్బందీగా ఈసారి పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కాగా, 25 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,490 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 45 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించనున్నారు. గతేడాది పరీక్షల కోసం మొత్తం 30 వేల మందిని ఇన్విజిలేటర్లుగా వినియోగించుకున్నారు. ఈ సారి ఆ సంఖ్యను దాదాపు 45 వేలకు పెంచుతున్నట్లు అధికారిక వర్గాల సమాచారంగా తెలుస్తోంది. 2026 ఫిబ్రవరి నుండి నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. గతంలో విద్యార్థులు తమ సొంత కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ రాసేవారు. కానీ ఇప్పుడు వేరే కళాశాలకు వెళ్లి రాయాల్సి ఉంటుం ది. ఈ కొత్త విధానం వల్ల పరీక్షల పర్యవేక్షణ కట్టు దిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు అదనపు సిబ్బంది ని, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ కాలేజీల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తారు. తర్వాత ప్రైవేటు కాలేజీలకు విస్తరించనున్నారు.
కట్టుదిట్టమైన చర్యలు
పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్‌ను కూడా రంగంలోకి దించుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు ఉండేలా జిల్లా అధికారులు తనిఖీలు చేపట్టాలని బోర్డు ఆదేశించింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య పది లక్షలకు చేరువయ్యింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవడం ఇదే మొదటి సారి అని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. 2025 మార్చిలో జరిగిన పరీక్షలకు ప్రైవేటు కాలేజీల్లో సీసీ కెమెరాలు అమర్చినా, ఇంటర్ బోర్డు లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ తో వాటిని అనుసంధానించడం పూర్తి కాలేదు. ఈ సారి పరీక్షలకు వెయ్యి కాలేజీలకు సీసీ కెమెరా లను అనుసంధానించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే సగం కాలేజీల్లో పూర్త యినట్లు అధికారిక వర్గాల సమాచారం. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.






