గ్యాస్ నిల్వలు ఉంచడంలో విఫలమైతే కఠిన చర్యలు

by velandi.Saikiran |

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా తగినంతగా ఉంచడంలో ఏజెన్సీలు విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమిషనర్​స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.

గ్యాస్ నిల్వలు ఉంచడంలో విఫలమైతే కఠిన చర్యలు
X

గ్యాస్ నిల్వలు సరిపడ ఉంచడంలో ఏజెన్సీలు విఫలమైతే కఠిన చర్యలు

ఆటో డ్రైవర్లకు గ్యాస్ అందేలా చూడటం పౌరసరఫరా శాఖ కర్తవ్యం : కమిషనర్​ స్టీఫెన్ రవీంద్ర

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్యాస్ సరఫరా తగినంతగా ఉంచడంలో ఏజెన్సీలు విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమిషనర్​స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ప్రజల రవాణాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆటో డ్రైవర్లకు గ్యాస్ అందేలా చూడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయమని స్పష్టం చేశారు. బుధవారం పౌర సరఫరాల భవన్‌లో ప్రైవేట్ ఆటో ఎల్‌పీజీ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 బంకులతో ఆటో ఎల్‌పీజీ మార్కెట్‌లో ఈ ప్రైవేట్ కంపెనీలకే 80 శాతం వాటా ఉందని, అన్ని మార్గాల ద్వారా వెంటనే ఎల్‌పీజీని దిగుమతి చేసుకుని అందుబాటులో ఉంచాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో గ్యాస్ సరఫరాను పెంచాల్సిన అవసరం చాలా ఉందని నొక్కి చెప్పారు. మధ్యప్రాచ్య దేశాల్లో తలెత్తిన సమస్యల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరా తగ్గిందని, ఇళ్లలో వాడే వంట గ్యాస్ సరఫరాలో లాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరుగుతున్నప్పటికీ, ఆటో ఎల్‌పీజీ సరఫరా మాత్రం 35 శాతం పడిపోయిందన్నారు. హైదరాబాద్‌లో ఆటోలు ఎలాంటి ఆటంకం లేకుండా నడిచేలా చూడటానికి పౌర సరఫరాల శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.

Next Story