CM Revanth Reddy: ఇకపై ఆ అధికారం సర్పంచ్ లదే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

by Prasad Jukanti |

వీధి లైట్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Revanth Reddy: ఇకపై ఆ అధికారం సర్పంచ్ లదే..  సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వీధిదీపాల (street lights) నిర్వహణ కోసం పెద్ద కంపెనీలను నుంచి టెండర్స్ పిలవడంతో పాటు వీధిదీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడంపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఐసీసీసీలో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్‍ఎంసీ అధికారులతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ పోల్ సర్వే చేయించాలని, ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని వీధిదీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‍తో అనుసంధానం చేయడంతో పాటు ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలన్నారు. గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను గ్రామ పంచాయతీకు (gram panchayats) అప్పగించాలని, వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచ్‍లకే అప్పగించి ఎంపీడిఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిఎన్.శ్రీధర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story