రుణమాఫీపై తప్పుడు ప్రచారం ఆపెయ్.. హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-11 04:39:07  IST  )

రుణమాఫీ, రైతు భరోసాపై మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ధ్వజమెత్తారు.

రుణమాఫీపై తప్పుడు ప్రచారం ఆపెయ్.. హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల ఫైర్
X

దిశ వెబ్‌డెస్క్: గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామని తుమ్మల క్లారిటీ ఇచ్చారు.

40 బ్యాంకులు పంపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రుణమాఫీ చేశామని తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా జమచేసిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. గతంలో నెలల తరబడి రైతుబంధు వేశారంటూ దుయ్యబట్టారు. రెండు పంటల కాలంలోనే రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు. రైతుల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేసే ప్రభుత్వమేదో హరీశ్ రావు చెప్పాలని ప్రశ్నించారు.

Next Story