- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR : ఆపరేషన్ కగార్ తక్షణమే ఆపండి : కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఏర్పాటై 25 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు(BRS Silver Jubli Celebrations) ఘనంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఏర్పాటై 25 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు(BRS Silver Jubli Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభ(Warangal Meeting) ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS cheif KCR) అధ్యక్షత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకు పడ్డారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను సమూలంగా ఏరి వేయడానికి చేపట్టిన 'ఆపరేషన్ కగార్'(Stop Operation Kagar) తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, అమాయకులను ఊచకోత కోస్తున్నారని తెలిపారు. అధికారం చేతిలో ఉందని ప్రాణాలు తీసుకుంటూ పోవడం కరెక్ట్ కాదని అన్నారు.
మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని అంటున్నారని, వెంటనే కూంబింగ్, కాల్పులు ఆపి.. వారితో చర్చలకు ముందుకు రావాలని కేంద్రానికి సూచించారు. ఆపరేషన్ కగార్ ఆపి, శాంతి చర్చలు జరపాలని కోరుతూ తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడిచినా తెలంగాణకు బీజేపీ 11 రూపాయలు ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా బీజేపీ జాతీయ హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను బతికించారనే నింద తెలంగాణపై మోపారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.






