- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ విజయోత్సవ ర్యాలీపై ప్రత్యర్థుల రాళ్ల దాడి
by Muthe.Rajitha |
నల్గొండ జిల్లా మాల్ గ్రామంలో నేడు జరిగిన సర్పంచ్, వార్డు మెంబర్ల బాధ్యతల స్వీకరణ అనంతరం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా మాల్ గ్రామంలో నేడు జరిగిన సర్పంచ్, వార్డు మెంబర్ల బాధ్యతల స్వీకరణ అనంతరం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచిన వెంకటయ్య సోమవారం విజయోత్సవ ర్యాలీ చేపట్టగా.. ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడింది. ర్యాలీలో పాల్గొన్న వారిపై రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడికి దిగడంతో.. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభి, ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవగా.. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని పొలిసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Next Story






