ఐటీఐలలో సాంకేతిక విద్యను అభివృద్ధికి చర్యలు : కార్మిక మంత్రి గడ్డం వివేక్​

by Muthe.Rajitha |

రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ లలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉపాధి అవకాశాలకు కావలసిన చర్యలను తీసుకోవాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్​వెంకట స్వామి అన్నారు.

ఐటీఐలలో సాంకేతిక విద్యను అభివృద్ధికి చర్యలు : కార్మిక మంత్రి గడ్డం వివేక్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉపాధి అవకాశాలకు కావలసిన చర్యలను తీసుకోవాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకట స్వామి అన్నారు. ఐటిఐలలో టెక్నికల్​విద్యను అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలకు చర్యలు తీసుకునేందుకు రూ. 4 వేల కోట్ల వరకు అవసరం అవుతుందని, ఈ నిధుల గురించి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో చర్చించి మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. హైదరాబాద్​ విద్యానగర్​ శివం రోడ్డులోని జాతీయ స్కిల్​డెవలప్​మెంట్​సంస్థ ఆధ్వర్వంలో రాష్ట్రంలోని ఐటిఐల ప్రిన్సిపాల్స్​కు సాంకేతిక పరిజ్ఞానంపై మూడు రోజుల వర్క్​షాప్​ ముగింపు వేడుకలు గురువారం జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గడ్డం వివేక్​ వెంకట స్వామి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు త్వరగా కల్పించేవే ఐటీఐ లు అని, వాటిలో ఉన్న కోర్సులకు విద్యా రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉపాధి అవకాశం కల్పించేలా ఐటీఐ లలో విద్యా బోదన జరగాలని మంత్రి గడ్దం వివేక్ ​వెంకట స్వామి సూచించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ లలో మౌళిక వసతుల కల్పనతో పాటు నూతన కోర్సులు, అలాగే సాంకేతిక పరిజ్ఞానం తదితర అవసరాల కోసం 4 వేల కోట్ల రూపాయలు అవసరం ఉందని సంబంధిత అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డితో చర్చించి ఆ నిధులను మంజూరు చేయించి ఐటీఐ లను మరింతగా పటిష్టం చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఐటీఐ లలో ఉన్న కోర్సులు చదివే విద్యార్థులకు త్వరలో ఉపాధి అవకాశాలు వస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐటీఐ లలో పని చేసే ప్రిన్సిపాల్స్​, అధ్యాపకులు విద్యార్థులకు సరైన బోధన, ప్రాక్ట్రికల్స్ చేయించి వారిలో నైపుణ్యం పెంచాలని సూచించారు. డిపార్ట్​మెంట్​ ఆఫ్ ​ఎంప్లాయ్​మెంట్ ​అండ్​ ట్రైనింగ్​ ఆధ్వర్వంలో ఈ నెల 10 నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన ఓరియంటేషన్​వర్క్​షాప్​లో పాల్గొన్న ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తు ఈ వర్క్​షాప్ ​ఐటీఐ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్​, నేషనల్​ స్కిల్​ డెవలప్​మెంట్​ రీజినల్​ మేనేజర్ ​శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్​ ప్రియా శ్రీనివాసన్ ​తదితరులు పాల్గొన్నారు.

వివేక్​కు కలిసిన పలువురు ఉద్యోగులు

కాగా నూతన మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్​వెంకట స్వామికి ప్రభుత్వం కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వశాఖను కేటాయించిన క్రమంలో బంజారాహిల్స్​మినిస్టర్​క్వార్టర్స్​లోని ఆయన నివాసంలో అడిషనల్​ కమిషనర్​ ఆఫ్​ లేబర్ ​ఈ. గంగాధర్​తో పాటు పలువురు ఉద్యోగులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story