BJP District Presidents : ఎల్లుండి బీజేపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన !

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో సంస్థాగత ఎన్నిక(Institutional Elections)ల సందడి తుది ఘట్టానికి చేరుకుంది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల(District Presidents) ఎంపికపై దృష్టి సారించింది.

BJP District Presidents : ఎల్లుండి బీజేపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన !
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో సంస్థాగత ఎన్నిక(Institutional Elections)ల సందడి తుది ఘట్టానికి చేరుకుంది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల(District Presidents) ఎంపికపై దృష్టి సారించింది. మెజార్టీ జిల్లాల్లో అధ్యక్షుల ఎంపిక తతంగం అనధికారికంగా ఖరారైనప్పటికి.. కొన్ని జిల్లాల కమిటీల అధ్యక్ష పదవికి పలువురు నాయకులు పోటీ పడిన నేపథ్యంలో జిల్లా కమిటీ అధ్యక్షుల ఎంపికపై అధికార ప్రకటన వాయిదా వేసింది. జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయ సాధనకు కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం ఇక అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.

దీనిపై రాష్ట్ర పార్టీ ఇంచార్జీ సునీల్ బన్సల్, ఎన్నికల పరిశీలకులు అరవింద మీనన్, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిలు కేంద్ర నాయకత్వంతో చర్చించి జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సిద్ధమయ్యారు. రేపు నామినేషన్ల స్వీకరణ, ఎల్లుండి ఆదివారం(Sunday) జిల్లాల అధ్యక్షుల ఎన్నికలపై ప్రకటన చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎన్నిక జనవరి నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాల అధ్యక్షుల ఎన్నికలు ఆలస్యం కావడంతో వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంది.

అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అనేక చర్చల తరువాత... పార్టీ నాయకత్వం ఈటెల రాజేందర్ పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో మరో ఇద్దరు నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో నిర్ణయం మారితే మినహా ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ కొత్త సారధి కావడం తధ్యంగా కనిపిస్తుంది.

Next Story