TG: సీఎస్ చైర్మన్‌గా స్టేట్ లెవల్ కమిటీ

by Gantepaka Srikanth |

కేంద్ర అటవీ, పర్యావరణ, క్లైమెట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్-2026 అమలు, పర్యవేక్షణ చేయడానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

TG: సీఎస్ చైర్మన్‌గా స్టేట్ లెవల్ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర అటవీ, పర్యావరణ, క్లైమెట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్-2026 అమలు, పర్యవేక్షణ చేయడానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా మున్సిపల్ శాఖ కార్యదర్శి, సభ్యులుగా పర్యావరణ, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ శాఖ స్పెషల్ సీఎస్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి, మున్సిపల్ శాఖ కమిషనర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ, నీరీ డైరెక్టర్, ఐఐసీటీ డైరెక్టర్, హోటల్స్, రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి, సిమెంట్ కంపెనీల ప్రతినిధి, క్రెడాయ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు.

జిల్లా స్థాయిలో కమిటీ..

రాష్ట్ర స్థాయి కమిటీతోపాటు కలెక్టర్ చైర్మెన్‌గా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మెంబర్ కన్వీనర్‌గా అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్), సభ్యులుగా డీపీఓ, డీఎంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, పరిశ్రమల శాఖ ప్రతినిధులు, టీజీపీసీబీ రీజినల్ ఆఫీసర్, విద్యాశాఖ అధికారి, చెత్త రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ప్రతినిధి, జిల్లా స్థాయిలో ఉన్న సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిపుణులు, ఎన్జీఓ ప్రతినిధి ఉండనున్నారు. జిల్లా స్థాయిలో ఈ కమిటీ సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్ అమలు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

37మంది మున్సిపల్ కమిఫనర్ల బదిలీ..

రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలతోపాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో కొత్తగా గ్రూప్-1, గ్రూప్-2 మున్సిపల్ కమిషనరన్లకు సైతం పోస్టింగ్ ఇచ్చారు.

Next Story