- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు
నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో మరో అవార్డు దక్కింది.

దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో మరో అవార్డు దక్కింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపల్ గంధం బుద్ధిరాజ్ శనివారం కళాశాలకు ఉత్తమ కళాశాల అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ లో హెచ్ఎంటీవీ, హాన్స్ ఇండియా పత్రికల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ విద్యా వ్యవస్థల ఉత్తమ సేవలు, ఫలితాల ఆధారంగా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను గుర్తించి అవార్డులను ప్రకటించారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీవీ, హాన్స్ ఇండియా పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ హనుమంతరావు, ఎడిటర్ వెంకటరెడ్డి లు పాల్గొన్నారు.
ఉత్తమ కళాశాల అవార్డును అందుకున్న సందర్భంగా ప్రిన్సిపల్ గంధం బుద్ధిరాజ్ మాట్లాడుతూ.. కళాశాల అభ్యున్నతికి రాష్ట్ర స్థాయిలో అవార్డ్ అందుకోవడం గర్వకారణమన్నారు. తనతో పాటు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం సంయుక్త కృషి కారణంగానే ఈ అవార్డు దక్కిందని ప్రిన్సిపల్ అన్నారు. అధ్యాపక, అధ్యాపకేతర బృందంకృషి అనిర్వచనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డుతో రావడంతో కళాశాల అభ్యున్నతికి మరింతగా పాటుపడతామని, బాధ్యత మరింత పెరిగిందన్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.






