చేవెళ్ల ప్రమాదంపై సుమోటోగా కేసు.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్

by Ramesh Naini |

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (19 మంది మృతి, పలువురు గాయాలు)పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.

చేవెళ్ల ప్రమాదంపై సుమోటోగా కేసు.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Chevella bus accident) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (19 మంది మృతి, పలువురు గాయాలు)పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ కేసు నంబర్‌ HRC No.7141/2025 గా నమోదు చేసింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్.. ‘దిశ పత్రిక’లో వచ్చిన ‘రహదారిపై మృత్యు ఘోష’ అనే కథనాన్ని ఆధారంగా తీసుకుని చర్యలు ప్రారంభించింది. రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

రవాణా శాఖ, హోం శాఖ, గనులు & భూగర్భశాస్త్ర శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అలాగే టీజీఎస్ ఆర్టీసీ అధికారుల నుండి ప్రమాదంపై సమగ్ర నివేదికలను డిసెంబర్‌ 15, 2025 ఉదయం 11 గంటలలోపు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఘటనపై మరింత విచారణ జరిపి బాధ్యత వహించాల్సిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Next Story