- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర గవర్నర్ బీజేపీకి చప్రాసీనా.. CPI నారాయణ సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణ గవర్నర్ బీజేపీకి చప్రాసీల వ్యహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ బీజేపీకి చప్రాసీల వ్యహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెప్టెంబర్ 17న బీజేపీ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 గురించి తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రాజాకార్లకు వ్యతిరేకంగా ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడింది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలు ఏది చెబితే రాష్ట్ర గవర్నర్ అందుకు తలాడిస్తున్నాడని నారాయణ కామెంట్ చేశారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 రాగానే హడావుడి చేయడం వారికి పరిపాటిగా మారిందని చురకలంటించారు. ఏనాడైనా ప్రజలకు అండగా ఉండి పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులదేనని ధ్వజమెత్తారు. 1925లో సీపీఐ పార్టీ, ఆర్ఎస్ఎస్ పుట్టాయని.. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త పాల్గొనలేదన్నారు. బ్రిటీష్ లాఠీ, బుల్లెట్ దెబ్బలు వారికి తగలేదని అన్నారు. 4,500 మంది కమ్యూనిస్టులు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలర్పించారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు సెప్టెంబర్ 17పై కల్లబొల్లి మాటలు బంద్ చేయాలని నారాయణ హితవు పలికారు.






