రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి బెన్ ​షా

by Muthe.Rajitha |

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి బెన్​ షా నియమితులయ్యారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి బెన్ ​షా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి బెన్​ షా నియమితులయ్యారు. రెవెన్యూ శాఖ లో డిప్యూటీ కలెక్టర్​గా పనిచేస్తున్న బెన్​షాను కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పంచాయతీరాజ్​ శాఖ కార్యదర్శి లోకేశ్​కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కార్యదర్శిగా పనిచేసిన అశోక్​ కుమార్​ పదవి విరమణ చేసిన తరువాత ఆయన పదవి కాలం గడువు పొడగించలేదు. దీంతో కొత్త కార్యదర్శిగా రెవెన్యూ శాఖకు చెందిన బెన్​ షా ను నియమితులయ్యారు. ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కార్యదర్శి కీలకం. ఈ నేపథ్యంలో కొత్త కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది.

Next Story