- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ మంత్రి మండలి శనివారం ఉదయం సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనున్నది. ఉదయం 9 గంటలకు సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోద ముద్రవేయనున్నది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
Next Story






