బీసీ రిజర్వేషన్లపై అస్త్ర సన్యాసం సరికాదు.. ప్రభుత్వ నిర్ణయంపై బీసీ కమిషన్ చైర్మన్ అసంతృప్తి

by Gantepaka Srikanth |

బీసీ రిజర్వేషన్లపై అస్త్ర సన్యాసం సరికాదు: బీసీ కమిషన్ చైర్మన్

బీసీ రిజర్వేషన్లపై అస్త్ర సన్యాసం సరికాదు.. ప్రభుత్వ నిర్ణయంపై బీసీ కమిషన్ చైర్మన్ అసంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కోర్టు కేసుల నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయించి డిసెంబర్‍లోనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు కల్పించి ఆ దిశలో తీవ్రంగా ప్రయత్నించి చివరకు బీసీల ఆశలపై నీళ్లు చల్లే విధంగా 50 శాతం లోపు రిజర్వేషన్లు కల్పించే విధంగా నిర్ణయించడం ఆత్మహత్యసదృశ్యమేనన్నారు. ఈ మేరకు ఇవాళ నిరంజన్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని, రిజర్వేషన్లు 50 శాతం మించవద్దన్న తీర్పును సవాల్ చేయాలని ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరాలన్నారు. బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టకపోవడం దురదృష్టకరం అని రాజకీయ కారణాలతోనే బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టట్లేదని విమర్శించారు.

సీజేఐ మాటలు కనువిప్పుకావాలి:

పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయని గత ఆదివారం ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జరిగిన ఓ సమావేశంలో సీజేఐ జస్టిస్ బి.ఆర్ గవావ్ మాట్లాడారని, పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయనే మాట చెప్పారని ఈ సందర్భంగా నిరంజన్ గుర్తు చేశారు. సాంఘీక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేస్తుంది. అంబేద్కర్ కోరుకున్నది కూడా అదేనని సీజేఐ పేర్కన్నారని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో అటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో జరుగుతున్న ప్రతివాదనలకు సీజేఐ వ్యాఖ్యలు కనువిప్పు కలిగించాలన్నారు. కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐదుగురు జడ్జిల బెంచ్ రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగా ఉండొద్దన్న తీర్పును ఆధారంగా చేసుకుని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఇది కాలానుగుణమైన మార్పులను పరిగణలోకి తీసుకోకుండా జరుగుతున్న వాదనలు అని బీసీలకు గొడ్డలిపెట్టుగా మారుతున్న విషయం అన్నారు.

ఇంటింటి సర్వే లెక్కచేయకపోవడం సమంజసం కాదు :

వ్యయ ప్రయాసలతో నిర్వహించిన ఇంటింటి సర్వేను లెక్కచేయకపోవడం సమంజసం కాదని రాజకీయ కారణాలతో బీసీ బిల్లులను 9వ షెడ్యూలులో పెట్టకపోవనడం దురదృష్టకరం అన్నారు. ఇది బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసే చర్యలగా భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు. అన్ని ప్రయత్నాలు చేసి ఈ దశలో బీసీ రిజర్వేషన్లపై అస్త్రసన్యాసం సరికాదన్నారు. 50 శాతం రిజర్వేషన్ల కంటే మించవద్దని ఐదుగురు జడ్జిల బెంచ్ ఇచ్చిన తీర్పును వెంటనే చాలెంజ్ చేస్తూ ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపి బీసీలకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాలని సూచించారు.

Next Story