- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టడం ఈజీనే.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ పాలిటిక్స్‌లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పెట్టబోయే కొత్త పార్టీపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ వార్తలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని అన్నారు. అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు అని సానుకూలంగా స్పందించారు. కవిత కొత్త పార్టీ పెట్టడాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
పార్టీ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే..
ఈ రోజుల్లో పార్టీలు పెట్టడం సులభమేనని.. వాటిని నడపడం ప్రజల మద్దతుపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రజలు ఆదరించినప్పుడు మాత్రమే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగిస్తుందని తెలిపారు. కేవలం పార్టీ ప్రకటించినంత మాత్రాన సరిపోదు, క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి కామెంట్ చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ రావడం వల్ల కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎలాంటి నష్టం లేదని, తమ ఓటు బ్యాంక్ చెక్కుచెదరదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మా ప్రభుత్వంపై.. తీసుకునే విధానాలపై పూర్తి నమ్మకంతో ఉన్నా మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.






