- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్స్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్స్ నియామకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్స్ నియామకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు 20 మంది స్టార్ క్యాంపెయినర్స్‌ను, గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీలకు ఐదుగురిని నియమించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్లకు వాహనాలకు అనుమతి ఇచ్చే అధికారాన్ని పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఇచ్చింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు 71 రిజిస్టర్ పార్టీలకు కూడా వాహనాలను పంచాయతీరాజ్ కమిషనర్ ఇవ్వనున్నారు. స్టార్ క్యాంపెయినర్ల పేర్లను ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన ఐదు రోజుల్లో ఇవ్వాలని ఎస్ఈసీ సూచించింది.
ఈ జాబితాలను జిల్లా ఎన్నికల అధికారులకు పంచాయతీ రాజ్ కమిషనర్ పంపించాల్సి ఉంటుంది. ఎన్ని వాహనాలకు అనుమతి ఇచ్చారు? ఆ వాహనాల నంబర్ తదితర వివరాలను ఎన్నికల పరిశీలలకు అందించాల్సి ఉంటుంది. వాటిని ఎన్నికల వ్యయంలో పొందుపరుస్తారు. స్టార్ క్యాంపెయినర్ చేసే ప్రచారానికి సంబంధించిన ఎన్నికల వ్యయం మొత్తం అభ్యర్థి ఎన్నికల ఖర్చు గా పరిగణిస్తారు. అభ్యర్థి ఆ సభ, ర్యాలీలో లేకపోయినా, ఆ అభ్యర్థిని గెలిపించాలని, ఆ అభ్యర్థి ఫోటో కానీ ఉంటే ఆ ఖర్చు మొత్తం అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కిందికి వస్తుందని తెలిపారు. ఒక వేళ ఒకరికి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొంటే ఆ ఖర్చును అభ్యర్థు ఖర్చులో సమానంగా జమ చేస్తారు.






