TG: మీసేవ వాట్సాప్‌‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సేవలు

by Gantepaka Srikanth |

డిజిటిల్ సేవల్లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.

TG: మీసేవ వాట్సాప్‌‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిజిటిల్ సేవల్లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ విభాగం సేవలను వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్లో పొందే అవకాశం అందుబాటులోకి తెచ్చినట్లు మీసేవ కమిషనర్ టి.రవికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడ నుంచైనా భూమి సంబంధిత వివరాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ రూపంలో సులభంగా అందుబాటులోకి తీసుకురావాలన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు నవంబర్ 18, 2025న ప్రారంభమైన మీసేవ వాట్సాప్/చాట్‌బాట్ సేవలు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందాయని తెలిపారు. మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా రిజిస్ట్రేషన్ పత్రం సర్టిఫైడ్ కాపీ, ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్, స్టాంప్‌ల కొనుగోలు, ఫ్రాంకింగ్, డెఫిసిట్, సొసైటీలు, సమాచార హక్కు దరఖాస్తు, ఫర్మ్‌లు, అపరాధ రుసుం చెల్లింపు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 8096958096 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో ‘హాయ్’ అని మెస్సేజ్ పంపించాలి. తర్వాత కావలసిన సేవ పేరు టైప్ చేసి, ఫామ్ నింపి, ఆన్‌లైన్‌లో చెల్లింపు పూర్తిచేయొచ్చని సూచించారు. పెనాల్టీ, డెఫిసిట్, స్టాంప్స్ వంటి సేవల్లో చెల్లింపు తర్వాత సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు స్వీకరించవచ్చని తెలిపారు. ఈసీ మీసేవా కేంద్రంలో అందుతుందని.. సర్టిఫైడ్ కాపీ మాత్రం ఆమోదం తర్వాత నేరుగా వాట్సాప్‌లోనే చేరతాయని వెల్లడించారు.

Next Story