గురుకుల పాఠశాలలో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

by Gantepaka Srikanth |

మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

గురుకుల పాఠశాలలో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అనూహ్యంగా ఈ ఉదయం 6:30 గంటల సమయంలో తరగతి గదిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూల్‌కు వచ్చిన టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story