సృష్టి ఫెర్టిలిటీ కేసు.. చంచల్‌గూడ జైలులో నిందితుల ఈడీ విచారణ

by Kema Shiva Kumar |

సృష్టి ఫెర్టిలిటీ కేసు (Creation Fertility Case)లో ఈడీ (ED) అధికారులు విచారణను వేగవంతం చేశారు.

సృష్టి ఫెర్టిలిటీ కేసు.. చంచల్‌గూడ జైలులో నిందితుల ఈడీ విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: సృష్టి ఫెర్టిలిటీ కేసు (Srishti Fertility Case)లో ఈడీ (ED) అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు డాక్టర్‌ నమ్రత (Namratha), కళ్యాణి, నందిని, సంతోషితో పాటు జయంత్‌ కృష్ణను కోర్టు అనుమతితో అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం వారంతా చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)లో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో అక్కడే విచారించేందుకు ఈడీకి కోర్టు అనుమతించింది. అయితే, ఈనెల 28 వరకు నిందితులను కేసులో దర్యాప్తు బృందం ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయనుంది.

కాగా, సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలో గోపాలపురం (Gopalapuram) పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఆ కేసు దర్యాప్తును సిట్‌ (SIT)కు అప్పగించారు. ఈ క్రమంలోనే సృష్టి అక్రమాలను వెలికితీసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. కేసులో నిందితులంతా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా ఇప్పటికే సోదాల్లో గుర్తించి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కోర్టు నిందితులను విచారించేందుకు ఈడీ అధికారులకు అనుమతి ఇవ్వడంతో వారికి మంగళవారం నోటీసులు జారీ చేసి ఈనెల 28 వరకు వారిని జైలులోనే విచారించనున్నారు.

Next Story