శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

by Ajay Maddhiboyina |

శ్రీశైలం జలాశయానికి వదర ఉధృతి కొన‌సాగుతోంది. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌తో జూరాల ప్రాజెక్టు నుండి ఒక గేటు ద్వారా నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి వదర ఉధృతి కొన‌సాగుతోంది. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌తో జూరాల ప్రాజెక్టు నుండి ఒక గేటు ద్వారా నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం నుండి ప్రస్తుతం ఒక గేటు 10 అడుగ‌ల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. జ‌లాశ‌యానికి ఇన్‌ఫ్లో 73,586 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 95,677 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులుగా ఉంది. మొన్నటి వరకు భారీ వర్షాలు కురవడంతో జలాశయానికి భారీగా వరదనీరు చేరింది. దీంతో గేట్లను ఎత్తు నీటిని వదిలారు. ప్రస్తుతం కాస్త తగ్గముఖం పట్టింది.

Next Story