- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంచెత్తిన వరదలు.. శ్రీశైలం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత
మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో గత రెండు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో గత రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న జలాశయాలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల (Jurala and Sunkesula projects)కు భారీ వరద (huge flood) వస్తుండటంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project)కు రాత్రి వరకు భారీ వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నాగార్జున సాగర్ లోకి పరుగులు తీస్తుంది. ఎగువన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,53,819 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. దీంతో 9 గేట్లు, కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్లను మరోసారి ఎత్తడంతో పర్యాటకుల తాకిడి పెరగనుంది.






