- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ హక్కుల గురించి బరాబర్ మాట్లాడుతం: BRS
తెలంగాణ హక్కుల గురించి బరాబర్ మాట్లాడుతం: BRS

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.7 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే పీసీసీ అధ్యక్షులు, మంత్రులు అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ మాట్లాడిన అంశాలపై రివ్యూ చేసుకోవాలని సూచించారు. పాలమూరు పచ్చబడితే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడ్డాయని.. ఎస్ఎల్‌బీసీ కుప్పకూలి మనుషులు చనిపోతే శవాలు తీయలేదని అన్నారు. డ్రింకింగ్ వాటర్ కోసం ఎవరి అనుమతులు అవసరం లేదని.. రిజర్వాయర్లన్నీ డ్రింకింగ్ వాటర్ కోసం కట్టారా అని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే ఏడు అనుమతులు వచ్చాయని తెలిపారు. 45 టీఎంసీలకు ఒప్పుకుంటే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఏం కావాలని నిలదీశారు.
తెలంగాణ హక్కుల గురించి బరాబర్ మాట్లాడుతామన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త మాటలు మాని చర్చకు రావాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ను కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టుగా మార్చిందన్నారు. 45 టీఎంసీలు ఇస్తామన్న కేంద్రం సూచనకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని ఆరోపించారు. పాలమూరును వలసల జిల్లాగా కాంగ్రెస్ మార్చిందని తెలిపారు. కాళేశ్వరం కుంగిపోలేదని.. కూల్చివేయబడిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర జరిగిందని.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద బ్లాస్టింగ్ జరిగిందని ఆరోపించారు. దీనిపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు అయిందని తెలిపారు. కచ్చితంగా వచ్చే ప్రభుత్వం తమదేనని.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసి కుట్రదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






