కాంగ్రెస్​ ప్రభుత్వం అబద్దాల పాలన సాగిస్తోంది.. రిజర్వేషన్ల అమలు మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్ ​ఆరోపించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం అబద్దాల పాలన సాగిస్తోంది.. రిజర్వేషన్ల అమలు మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో (Congress government) కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్ (Srinivas Goud) ​ఆరోపించారు. పక్క రాష్ట్రాలతో పాటు తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలను కొన్ని సార్లు మోసం చేయవచ్చు ప్రతి మోసం చేయడం కుదరని, సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడుతారని హెచ్చరించారు. (BC Reservations) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి అదే కొనసాగిస్తోందని, రిజర్వేషన్ల పెంపుపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పుడు జీవో తెచ్చారని ఆరు నెలల లోపే రిజర్వేషన్లు పెంచుతామని అప్పుడే ఎందుకు జీవో తేలేదని ప్రశ్నించారు. జీవో తోనే పని అయ్యేది ఉంటే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఎందుకు ,బిల్లు గవర్నర్, రాష్ట్రపతి దగ్గరకు ఎందుకు పంపాలని మండిపడ్డారు.

కోర్టులో కేసు ఉన్న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ జీవో చెల్లదని వారి ఆత్మసాక్షికి తెలియదా..? అంటూ నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచితే కోర్టులు కొట్టేశాయని ఈ ప్రభుత్వానికి తెలియదా, అసెంబ్లీలో బిల్లును ఆమోదించి ప్రధానిని ఎందుకు కలవలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నాయని, మహారాష్ట్ర లో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే సుప్రీంకోర్టు మొత్తం ఎన్నికల ప్రక్రియను కొట్టి వేసిందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి ని రాష్ట్రంలో తీసుకొచ్చే కుట్రలు చేయవద్దని హెచ్చరించారు.

ఆర్థికంగా వ్యయప్రయాసలకు ఓర్చి ఎన్నికల్లో గెలిచిన వారి పరిస్థితి కోర్టు కొట్టేస్తే ఏమిటని, బీసీలను ఈ ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీయించాలనుకుంటుందని, సుప్రీంకోర్టులో ఎవరు చిన్న పిటిషన్ వేసినా మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశం ఉందన్నారు. బీసీలను తెలివి లేని వాళ్ళుగా కాంగ్రెస్ భావిస్తోందని, ఎన్నికల్లో గెలిచిన బీసీ ల పదవులు రద్దయితే వారికి ఉన్నత పదవులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా కాంగ్రెస్ మంత్రివర్గంతో పాటు, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు జరగాలన్నారు.

Next Story