- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల ప్రకటనలపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
స్థానిక ఎన్నికల ప్రకటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికల ప్రకటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమే అని అన్నారు. రిజర్వేషన్లపై బీసీలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని ఆరోపించారు. బీసీ బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను, బీసీలను మళ్లీ మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని.. అంతా అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ప్రభుత్వంలోనూ బీసీలకు అక్కరకు రాని పదవులే ఇస్తున్నారని సీరియస్ అయ్యారు.
కాగా ఆదివారం ఉదయం స్థానిక ఎన్నికలకు సంబంధించిన అప్‌డేట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. సోమవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని.. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు.






