- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్లు కాంపౌండ్ బంద్ చేసి చూడు..వేటాడుతాం! ప్రభుత్వానికి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
లిక్కర్ మాఫీయాకు తలొగ్గి కల్లుగీత వృత్తిని బంద్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: లిక్కర్ మాఫీయాకు తలొగ్గి కల్లుగీత వృత్తిని బంద్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కల్లు కాంపౌండ్ ద్వారా పది కులాలు బ్రతుకుతున్నాయని అన్నారు. ఉప్పల్‌లో తాటి చెట్లు కొట్టి గీత కార్మికులకు నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు కంపౌండ్‌ను నిషేధిస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తోందని ఆరోపించారు. లిక్కర్ కంపెనీలు, డిస్టలరీలన్ని ఒకరిద్దరు చేతుల్లో నడుస్తున్నాయని అన్నారు. లిక్కర్ కంపెనీల కమీషన్లకు కక్కుర్తిపడి, లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లు కాంపౌండ్ బంద్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కల్లులో మీరే ఏదో కలిపి కుట్ర చేస్తూ ఓఆర్ఆర్ లోపల కల్లుపై నిషేధం విధించాలని చూస్తున్నారని అన్నారు.
కల్లు కాంపౌండ్ దమ్ముంటే బంద్ చేసి చూడు..
ఎన్టీఆర్ మద్య నిషేధం సమయంలోను కల్లును నిషేధించలేదని గుర్తుకు చేశారు. కల్లు, నీరాకు ఔషధ గుణాలు ఉంటాయని, నీరాను ప్రైవేట్ వాళ్లకు అప్పగించారని మండిపడ్డారు. కల్తీ పాలు అరిటకట్టడంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన బీర్లను తెలంగాణలో అమ్ముతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 నుంచి రూ. 15 లక్షలు ఇస్తున్నారని, దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు నెలవారీ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. గీత సంఘాల నుంచి ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటూ కల్తీ కల్లును ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. (Kallu compound) కల్లు కాంపౌండ్ దమ్ముంటే బంద్ చేసి చూడండి.. కల్లు కంపౌండ్ బంద్ చేస్తే ప్రభుత్వాన్ని నడవనీయం అని వార్నింగ్ ఇచ్చారు.
కల్లు నిషేధిస్తే ఎవరిని వదిలిపెట్టం..
మళ్లీ కేసీఆర్ సీఎం కాగానే కల్లు దుకాణాలను తెరిపిస్తామన్నారు. కల్లు దుకాణాలు బంద్ పెడితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద మామూళ్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేల పేర్లు బయటపెడతామని హెచ్చరించారు. కల్లు కాంపౌండ్ పేదోళ్లకు రిక్రియేషన్ సెంటర్ లాగా ఉంటుందన్నారు. మేము అధికారంలోకి వచ్చాక లిక్కర్ మాఫియా నుంచి కల్లు కాంపౌండ్ నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కల్లు చెట్లు నరికిన వారిపై కేసులు పెట్టండని సూచించారు. కల్లు నిషేధిస్తే ఎవరిని వదిలిపెట్టం, వెంటాడి వేటాడుతామన్నారు.






