- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత లెటర్ మీద మాకే క్లారిటీ లేదు.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
తండ్రి కేసీఆర్(KCR)కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) రాసిన లేఖపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తండ్రి కేసీఆర్(KCR)కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) రాసిన లేఖపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత లేఖపై తమకు ఇంకా క్లారిటీ రాలేదని అన్నారు. కాంగ్రెస్‌లో ఆ పార్టీ నేతలు రోజూ కొట్టుకుంటున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపైనా క్లారిటీ లేదు.. కానీ రోజూ బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కావాలనే.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీ అని.. కాంగ్రెస్, బీజేపీలు బలం ఏంటో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. అసలు ఒరిజినల్ లేటరా? లేక ఫేక్ లెటరా? పూర్తిగా తెలుసుకొని మాట్లాడుతామని అన్నారు. ఇదిలా ఉండగా.. వరంగల్ వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై కేసీఆర్ పరిమితంగా మాట్లాడటంతో భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగానాలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొన్నారు. సభ విజయవంతమైనందుకు కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసిన కవిత.. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ పేరిట 8 అంశాలను ప్రస్తావించారు. ఈ లెటర్‌పై దాదాపు అన్ని పార్టీల నేతలు స్పందించారు.
Also Read: Bandi Sanjay : నాన్నకు లేఖ.. కాంగ్రెస్ వదిలిన బాణం : బండి సంజయ్






