- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu: అభ్యర్థి ప్రకటన ఆలస్యమైనా విజయం మాదే: మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Elections) నియోజకవర్గానికి ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్‌ను (MLC Election Notification Schedule) ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Elections) నియోజకవర్గానికి ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్‌ను (MLC Election Notification Schedule) ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కాగా, నల్గొండ-ఖమ్మం- వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్ - మెదక్ - ఆదిలాబాద్- నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాలకు బీజేపీ (BJP) తమ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ప్రకటించగా.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ (BRS) పోటీ విషయంలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీజేపీ (BJP) నుంచి మల్క కొమురయ్య (Malka Komaraiah), పీఆర్టీయూ (PRTU) నుంచి వంగ మహేందర్ రెడ్డి (Vanga Mahender Reddy), యూటీఎఫ్ (UTF)-టీపీటీఎఫ్ (TPTF) సంయుక్త అభ్యర్థిగా అశోక్ కుమార్ (Ashok Kumar) పేర్లు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. నల్గొండ టీచర్స్ అభ్యర్థులుగా పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డి (Sripal Reddy), యూటీఎఫ్ (UTF) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి (A Narsireddy), బీజేపీ (BJP) నుంచి పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి (Sarvottham Reddy), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ (Pula Ravinder), వరంగల్ (Warangal) చెందిన వెంకట స్వామి (Venkata Swamy), సుందర్ రాజు పోటీకి సై అంటున్నారు. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Karimnagar Graduate MLC) స్థానానికి గాను బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి రవీందర్ సింగ్ కొంతకాలంగా అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై తాజాగా మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ లేదా రేపు పోటీ చేసే అభ్యర్థి పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఒకవేళ అభ్యర్థి ప్రకటన ఆలస్యమైనా.. తాము ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగువేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.






