బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. పార్క్ హయత్ హోటల్‌లో పడుకోమని పిలిచాడని బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-20 07:16:06  IST  )

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. పార్క్ హయత్ హోటల్‌లో పడుకోమని పిలిచాడని బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌సైట్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలో ఉన్న వేళ ఆ కేసుకు సంబంధించిన పాత వీడియోలు, ఇంటర్వ్యూలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఏ ప్లాట్ ఫాంను ఓపెన్ చేసినా నాటి ఫోన్ ట్యాపింగ్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్ లీడర్స్‌ను టార్గెట్ చేస్తూ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై నటి శ్రీరెడ్డి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ వీడియోలో శ్రీరెడ్డి జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చెప్పిన దాని ప్రకారం..

‘జీవన్ రెడ్డి బిగ్ ఫ్రాడ్. నన్ను వేధించాడు. తన వెనుక చాలా మంది ఉన్నరు. అమ్మాయిలను ఎప్పుడు పార్క్ హయత్ హోటల్‌కు ఇన్వైట్ చేస్తడు. పిలిస్తే వెళ్లి కలిశా. నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్‌ను.. సినిమాల్లో బ్లాక్ మనీ పెడుతాం. ఈవెన్ రామ్ చరణ్, ప్రభాస్ కూడా మేం చెప్పింది చేయాల్సి ఉంటుంది. మేం అధికారంలో ఉన్నాం కాబట్టి చేయాల్సిందే అని చెప్పాడు. నేను పతివ్రతను అని చెప్పట్లేదు కానీ ఆరోజు కంఫర్ట్‌గా లేను. ఆయనను గుడ్డిగా నమ్మి పడుకోలేను కాబట్టి టైమ్ అడిగా. నా ఫ్రెండ్స్ కూడా వెళ్లారు. అలా చాలా మంది అమ్మాయిలను వాడుకున్నడు’ అని చెప్పుకొచ్చింది. కాగా శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి.

VIDEO

Next Story