- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ సమ్మిట్‌లో పీవీ సింధు సందడి.. ఫ్యూచర్ సిటీలో క్రీడా మైదానాలపై హాట్ కామెంట్స్
భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సందడి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళా క్రీడాకారులు ఎన్నో మెడల్స్ గెలుస్తున్నారని అన్నారు. మనం ముందుకు వచ్చి వాళ్లకి సపోర్ట్ చేస్తే నెంబర్ వన్ గా నిలుస్తారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి సహకారం అందిస్తుందని, క్రీడాకారులకు సరైన గైడెన్స్ చాలా అవసరం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో క్రీడా మైదానాలు ఏర్పాటు కావాలని, అందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని అభిప్రాయం తెలిపారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. సమ్మిట్‌కు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.






