జిల్లాల్లోనే స్పెషాలిటీ వైద్యం : Minister Harish Rao

by Disha Web Desk 3 |
జిల్లాల్లోనే స్పెషాలిటీ వైద్యం : Minister Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : జిల్లాల్లోనే స్పెషాలిటీ వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నదని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు పేర్కొన్నారు.ఆదివారం టీచింగ్​ఆసుపత్రుల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హాస్పిటల్​లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ లు సమర్ధవంతంగా పని చేయాలన్నారు. ప్రతీ సోమవారం ఆర్ఎంవోలు, సూపరిడెంట్లు సమావేశమై ఇన్ ఫెక్షన్ కంట్రోల్ పై సమీక్ష జరపాలన్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ ను, నర్సును గుర్తించి వారికి నిమ్స్ లో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతీ హస్పిటల్ లో ఇన్భెక్షన్ సమస్యలు రాకుండా పకడ్బందిగా పని చేయాలి.అన్ని ఆసుపత్రులకు ఎయిర్ శాంపిలర్స ను సద్వినియోగం చేసుకొని ఎయిర్ చెకింగ్ తో పాటు, స్టెరిలైజేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవదన్నారు. అన్ని వేళల్లో తగిన స్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్లాన్​ చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లోనూ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

పారిశుధ్య నిర్వహణ, డైట్ సరిగ్గా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ బృందాలను ఏర్పాటు చేసుకొని, అవయవ మార్పిడిలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారన్నారు. అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని, గర్భిణీలకు అన్ని రకాల పరీక్షలుచేయాలన్నారు. వైద్యపరికరాలు పాడయితే వెంటనే వాటిని గంటల్లోనే రిపేర్ చేసేలా పీఎంయూ విధానం తీసుకువచ్చామని, దీన్ని వినియోగించుకుంటూ రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సమీక్షలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టివీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

Also Read...

బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ భారీ స్కెచ్

Next Story