- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక వర్క్ బుక్స్.. విద్యాశాఖ కీలక నిర్ణయం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ప్రత్యేకంగా వర్క్ బుక్స్ అందజేయాలని సంకల్పించింది. ఈ వర్క్ బుక్స్‌ను రానున్న జూన్ నెలాఖరు నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరవేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టుల వర్క్ బుక్ లను సులభంగా అర్థమయ్యేలా కన్వర్జేషన్ విధానంలో మాడ్యూల్స్ తయారు చేశారు. కానీ ఈ వర్క్ బుక్ ప్రింటింగ్ ప్రాసెస్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ అధికారులు భావించినట్లు జూన్ నెలాఖరుకు అందుతాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రాక్టిస్‌తోనే మెరుగైన ఫలితాలు..
కేవలం పాఠాలు వినడమే కాకుండా, నిరంతర సాధన ద్వారానే విద్యార్థులు సబ్జెక్టులపై పట్టు సాధించగలరని, తద్వారా పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వర్క్ బుక్స్ విద్యార్థులకు ఎంతగానో దోహదపడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ నిర్ణయం ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరనుంది.
90 శాతం ఇంగ్లీష్ మీడియంలోనే..
ప్రస్తుత ఆధునిక విద్యా విధానానికి అనుగుణంగా, పోటీ ప్రపంచంలో ప్రభుత్వ స్కూళల్లో విద్యార్థులు రాణించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పంపిణీ చేయబోయే పుస్తకాల్లో దాదాపు 90 శాతం పుస్తకాలను ఇంగ్లీష్ మీడియంలోనే ముద్రించడం గమనార్హం. దీనివల్ల విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు పెరగడమే కాకుండా, సిలబస్ లో పొందుపరిచిన అంశాలను విద్యార్థులు పాఠం చెప్పడం పూర్తయిన వెంటనే ప్రాక్టీస్ చేసేందుకు వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. తద్వారా ఆయా అంశాలపై పట్టు పెరిగి విషయ పరిజ్థానం పెరుగుతుందని చెబుతున్నారు.






