Special Trains: శ్రీవారి భక్తులకు తీపికబురు.. తిరుపతికి 8 స్పెషల్ ట్రైన్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-30 04:17:01  IST  )

వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు టూర్లకు ప్లాన్ చేస్తున్నారు.

Special Trains: శ్రీవారి భక్తులకు తీపికబురు.. తిరుపతికి 8 స్పెషల్ ట్రైన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. కొందరు పర్యాటక ప్రదేశాలుకు వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దర్శించేందకు వెళ్లున్నారు. ఈ క్రమంలోనే కలియుగ దేశం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే, వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల కోసం సికింద్రాబాద్‌ (Secunderabad)- తిరుపతి (Tirupati) వయా వికారాబాద్‌ (Vikarabad), గుంతకల్‌ (Guthakallu) మార్గంలో మొత్తం 8 స్పెషల్ ట్రైన్ల (Special Trains)ను నడుపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.

ఈ మేరకు మే 8 నుంచి 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి (07257), మే 9 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు (07258) స్పెషల్ ట్రైన్లు నడుపనున్నట్లుగా నడుస్తాయని CPRO శ్రీధర్‌ పేర్కొన్నారు. అవి సనత్‌నగర్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, సెడాం, యాద్గిర్‌, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోని, గుంతకల్‌, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్‌, కోడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

Next Story