తెలంగాణ మీడియా అకాడమీలో జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ కార్యకలాపాలు, అమలుచేస్తోన్న చట్టాలు, ప్రవేశపెట్టిన పథకాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆసక్తికలవారు రిజిస్టర్ చేసుకోవాలని కరుణాకర్ దేశాయ్ కోరారు.

తెలంగాణ మీడియా అకాడమీలో జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ
X
  • 18న భూమి చట్టాలు - వ్యవసాయం - గ్రామీణ అభివృద్ధి - పర్యావరణంపై శిక్షణ కార్యక్రమం
  • తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్

దిశ , తెలంగాణ బ్యూరో : గ్రామీణ, పట్టణ ప్రాంతం అని తేడా లేకుండా జర్నలిస్టుందరికీ ప్రభుత్వ కార్యకలాపాలు, అమలు చేస్తోన్న చట్టాలు, చేపట్టిన ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరమని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షులు కరుణాకర్ దేశాయ్ పేర్కొన్నారు. సామాన్యులకు తమ వంతు సేవ చేయాలనుకునే జర్నలిస్టులకు చట్టాలపైనా సంపూర్ణ అవగాహన అనివార్యమని తెలిపారు. అందుకే గ్రామీణ జర్నలిస్టులకు భూమి హక్కులు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇంకా పలు అంశాలపై ఈ నెల 18న తెలంగాణ ప్రెస్ అకాడమిలో ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందుకు "తెలంగాణ మీడియా అకాడమీ" ఆమోదం తెలిపినట్లు తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయి తెలిపారు. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ద్వారా రిజిస్టర్ చేసిన రూరల్ జర్నలిస్టులకు విడుతల వారీగా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, నాబార్డ్ మాజీ CJM మోహణయ్య పర్యావరణం నీటి వనరుల నిపుణులు బి.వి. సుబ్బారావు, ఇతర నిపుణులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

అలాగే ‘భూ భారతి - భూ సమస్యల పరిష్కారం’ అనే అంశంపై భూమి సునీల్(భూ చట్టాల నిపుణులు, న్యాయవాది, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు),

‘వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వ స్కీంలు, బ్యాంకు రుణాలు’ అనే అంశంపై మోహనయ్య(నాబార్డ్, మాజీ సీజీఎం)

పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల నిర్వహణ బి.వి. సుబ్బారావు (ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) లో సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ అడ్వైజర్‌)

‘డిజిటల్ రిపోర్టింగ్ అండ్ అగ్రి జర్నలిజం’ అనే అంశంపై కలమండ శరత్ (సీనియర్ జర్నలిస్ట్)

గ్రామీణ ప్రాంతం - రెవిన్యూ అంశాలు - శిరందాస్ ప్రవీణ్ కుమార్ (సీనియర్ జర్నలిస్ట్)

జర్నలిజం - నైతిక విలువలు’ అనే అంశంపై శ్రీనివాస్ రెడ్డి( చైర్మన్, తెలంగాణా ప్రెస్ అకాడమి), అవగాహన కల్పిస్తారని కరుణాకర్ దేశాయ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తన ఫోన్ నంబర్ 9849436246ను సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న వారికి ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Next Story