- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deepfake: డీప్‌ఫేక్ ఘటనలపై స్పెషల్ టీమ్.. చిరంజీవి కేసుపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
టాలివుడ్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ కేసు విచారణపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టాలివుడ్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) డీప్‌ఫేక్ కేసు (deepfake case) విచారణపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) స్పందించారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఇటీవల సెలబ్రిటీలు, నేతలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా డీప్‌ఫేక్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్‌ఫేక్ బారినపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో కేటుగాళ్లు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. ఇది గమనించిన ఆయన వెంటనే సీపీ సజ్జనార్‌కు తాజాగా ఫిర్యాదు చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ వ్యవహారంపై తాజాగా సజ్జనార్ మాట్లాడుతూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని తెలిపారు. డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్ వంటివి సమాజిక మాధ్యమాల్లో విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ టీమ్ ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో విచారణ చేపడుతుందన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే.. వారు తప్పించుకోలేరని, కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.






