- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఎన్నికలు.. ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు.. ఎందుకంటే?
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు, ఇతర ఎన్నికల వ్యవహారాలపై కోర్టుల్లో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు, ఇతర ఎన్నికల వ్యవహారాలపై కోర్టుల్లో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ కారణంగా ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక లీగల్ సెల్‌ను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు సూపరిండెంట్ స్థాయి అధికారులను ఈ సెల్‌కు నియమించారు.
లీగల్ సెల్‌లో కిషన్ సింగ్, మాధురి లత, క్రాంతి కిరణ్‌లను సూపరిండెంట్‌లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కోర్టుల్లో కొత్తగా దాఖలయ్యే కేసులకు జిల్లా స్థాయి అధికారులు 24 గంటల్లోగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులకు వివరాలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి కావాలని, కోర్టు కేసులు ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక సెల్ జిల్లాలన్నింటితో సమన్వయం చేస్తుందని కమిషనర్ కార్యాలయం ఉత్తర్వుల్లో తెలిపింది.






