- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిష్టాత్మక వీవీజీఎఫ్ సదస్సుకు మంత్రి సీతక్కకు ప్రత్యేక ఆహ్వానం
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క)కు అరుదైన గౌరవం లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క)కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ స్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్ (వీవీజీఎఫ్)’ సదస్సుకు ఆమెకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం మేరకు మంత్రి సీతక్క ఆదివారం నాడు నెదర్లాండ్స్‌కు చేరుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజా సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న నాయకులను మాత్రమే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానిస్తారు.మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం మంత్రి సీతక్క చేసిన నిరుపమానమైన కృషిని గుర్తించిన నిర్వాహకులు ఆమెకు ఈ గౌరవాన్ని అందించారు. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాల మహిళా నాయకులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను, అలాగే రాష్ట్రంలో చేపడుతున్న గ్రామీణాభివృద్ధి చర్యలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. మంత్రి సీతక్క అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర కార్యక్రమాలను వివరించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, మహిళా నాయకత్వానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు.






