సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానం

by Ajay Maddhiboyina |

సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల కోసం శంషాబాద్ నుండి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు రాత్రి మృతుల కుటుంబ స‌భ్యుల‌ను నాంప‌ల్లి హౌజ్ హౌస్ నుండి అధికారులు శంషాబాద్ విమానాశ్ర‌యానికి తీసుకువెళ‌తారు.

సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానం
X

దిశ, వెబ్ డెస్క్: సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల కోసం శంషాబాద్ నుండి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు రాత్రి మృతుల కుటుంబ స‌భ్యుల‌ను నాంప‌ల్లి హౌజ్ హౌస్ నుండి అధికారులు శంషాబాద్ విమానాశ్ర‌యానికి తీసుకువెళ‌తారు. అక్క‌డ నుండి సౌదీకి తీసుకెళ్ల‌నున్నారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిని గుర్తించ‌డంతో పాటు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించేందుకు సైతం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే 54 మంది యాత్రికులు మ‌క్కా యాత్ర కోసం సౌదీ వెళ్ల‌గా అక్క‌డ బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 45మంది హైద‌రాబాదీలు క‌న్నుమూశారు. ప్ర‌మాదం నుండి ఒకే వ్య‌క్తి బ‌య‌ట‌ప‌డ‌గా ప్ర‌స్తుతం అత‌డు కూడా షాక్ లోనే ఉన్నాడు. మ‌ర‌ణించిన కుటుంబాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించ‌గా, కేంద్ర రూ.2 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. దీంతో పాటు బాధితుల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్ల‌ను చేస్తోంది.

Next Story