- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడిగడ్డ ప్రొగ్రెస్‌పై స్పెషల్ కమిటీ.. NDSA రిపోర్ట్ ఆధారంగా యాక్షన్ ప్లాన్
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి దాదాపు నెల రోజులు కావొస్తుండటంతో ప్రభుత్వం తదుపరి చర్యలను స్పీడప్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి దాదాపు నెల రోజులు కావొస్తుండటంతో ప్రభుత్వం తదుపరి చర్యలను స్పీడప్ చేసింది. కాళేశ్వరం బ్యారేజీల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో పలు సూచనలు చేసింది. అక్కడ మరోసారి చేపట్టాల్సిన టెస్టులను వివరిస్తూనే.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలనూ సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం ఎన్‌డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంది. ఆ నివేదిక ప్రకారమే పరీక్షలతో పాటు మరమ్మతు పనులు చేయాలని ఇప్పటికే నిర్మాణ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. నీటి పారుదల శాఖకు సైతం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే రాష్ట్రం లోపల ఓ కమిటీని వేసుకొని తదుపరి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. అందులో భాగంగానే త్వరలోనే ‘వితిన్ ది స్టేట్’ అధికారుల కమిటీ ఏర్పాటు కానుంది.
యాక్షన్ ప్లాన్ ఇవ్వని నిర్మాణ సంస్థలు
మేడిగడ్డ పునరుద్ధరణపై ఇటీవల నిర్మాణ సంస్థలతో ప్రభుత్వం చర్చించింది. మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్అండ్‌టీ, అన్నారం నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆఫ్కాన్స్, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థ నవయుగ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్‌డీఎస్ఏ నివేదిక ఆధారంగా తదుపరి యాక్షన్ ప్లాన్ రూపొంమేడిగడ్డ ప్రొగ్రెస్‌పై స్పెషల్ కమిటీ.. NDSA రిపోర్ట్ ఆధారంగా యాక్షన్ ప్లాన్దించాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు బుధవారం వరకే గడువు ఇచ్చారు. కానీ.. ఇప్పటివరకు నిర్మాణ సంస్థలు యాక్షన్ ప్లాన్ ఇవ్వలేదు. ఏయే పరీక్షలకు ఎన్ని నిధులు అవసరం పడుతాయి? అలాగే పెండింగ్ బిల్స్ పైనా నివేదికతోపాటు పలు అంశాలపైనా యాక్షన్ ప్లాన్ కోరారు. ఈ నివేదికను నీటిపారుదల శాఖ మంత్రికి పంపిస్తామని ఆ సమయంలో నిర్మాణ సంస్థలు చెప్పారు. నేడు (గురువారం) ఇస్తామని చెప్పినప్పటికీ వారు ఇంతవరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయలేదన్నది సమాచారం.
ఏడో బ్లాక్ తొలగించాల్సిందే..
గత 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగగా దీన్ని పూర్తిగా తొలగించాలని ఎన్డీఎస్ఏ తన నివేదికలో సిఫారసు చేసింది. పరీక్షల అనంతరం బ్యారేజీలోని ఇతర బ్లాకుల పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయాలని సూచించింది. అలాగే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ప్రముఖ సంస్థలతో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయించడం.. బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతుల ప్రణాళికకు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తీసుకోవాలని వివరించింది. నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా పరీక్షలు చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ కేంద్ర సంస్థలను కోరింది. ఈ క్రమంలో వెంటవెంటనే ఆ పరీక్షలను చేయించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది.
పరీక్షల కోసం కేంద్రానికి లేఖ
మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో పలు పరీక్షలు చేయాలని ఎన్‌డీఎస్ఏ తన నివేదికలో సూచించింది. ఆ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై పరీక్షలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్ఎస్ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా భూ సాంకేతిక (జియో టెక్నికల్), భూ భౌతిక (జియో ఫిజికల్) పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్- ఢిల్లీ)కు, పుణెలోని కేంద్ర విద్యుత్, నీటి పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్)లకు రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ అధికారులు లేఖ రాశారు. మేడిగడ్డలో పరీక్షల కోసం సీఎస్ఎంఆర్ఎస్‌కు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరీక్షలకు సీడబ్ల్యూపీఆర్ఎస్‌లను కోరారు. ఈ పరీక్షలు చేసేందుకు అవసరమైన ఖర్చును సైతం వెంటవెంటనే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది.
సీడబ్ల్యూసీ ఆమోదం తప్పనిసరి..
మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పరీక్షల నిమిత్తం మూడు బ్యారేజీల వద్దకు చేరుకోవాల్సి ఉంది. వారు పరీక్షలు నిర్వహించి.. వాటికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. అయితే.. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రప్రభుత్వం ఈ మూడు బ్యారేజీలపై తీసుకోవాల్సిన చర్యల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఆ తరువాతే అక్కడ మరమ్మతులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఎన్‌డీఎస్ఏ రిపోర్టు రావడంతో ప్రభుత్వం కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరీక్షలు నిర్వహించి ఆ వెంటనే నివేదికను కేంద్రానికి చేర్చి.. అక్కడి నుంచి అనుమతి పొంది.. వెంటనే మరమ్మతులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నది.
అధికారులతో కమిటీ..
మేడిగడ్డపై సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యం అటు నిర్మాణ సంస్థలతో పాటు ఇటు నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను తెలుసుకుంటూనే.. తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు కోరుతున్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వం తరఫున పలు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇందులోభాగంగానే ఎక్కడా ప్రాసెస్‌లో ఆలస్యం కాకుండా అవసరమైతే వితిన్ స్టేట్ అధికారుల కమిటీ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో అధికారులతోపాటు పలువురు ఎక్స్‌పర్ట్స్‌ను నియమించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిసింది. నిర్మాణ సంస్థల యాక్షన్ ప్లాన్ వచ్చిన తరువాత వెంటనే ఈ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేడు మేడిగడ్డకు ఈఎన్సీ జనరల్
మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ.. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పరిస్థితిపై అంచనా వేయడానికి నేడు మరోసారి నీటి పారుదల శాఖ ఈఎన్సీ జనరల్ జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నది. వీరు అక్కడి పరిస్థితిని అంచనా వేసి.. తదుపరి కార్యాచరణను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. గురువారం ఒక్కరోజే మూడు పంప్‌హౌజ్‌లు, మూడు బ్యారేజీల్లో వీరు పర్యటించనున్నారు. ఈ బృందంలో గజ్వేల్ సీఈ బస్వరాజ్ సైతం ఉన్నారు. వీరు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ప్రభుత్వం తదుపరి కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఎన్‌డీఎస్ఏ నివేదిక, వీరి రిపోర్టుతో మేడిగడ్డపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.






