గుడ్‌న్యూస్: గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక బస్సులు.. విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఆహ్వానం

by Ramesh Naini |

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 కార్యక్రమానికి సాధారణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది.

గుడ్‌న్యూస్: గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక బస్సులు.. విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 కార్యక్రమానికి సాధారణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు అందరికీ ఉచితంగా ఆహ్వానం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు నగరంలోని 12 ప్రభుత్వ కళాశాలల నుంచి సుమారు 4800 మంది విద్యార్థులకు బుధవారం నాడు సమ్మిట్ సందర్శనకు తీసుకుపోతున్నట్లు అధికారులు వెల్లడించారు.

వివిధ డిపోల నుంచి 52 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు సామాన్య ప్రజలకు ప్రవేశం ఉచితమని గడు న్యూస్ చెప్పారు. అయితే ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడిపే అవకాశం కనిపించడం లేదని అధికారులు తెలిపారు. ప్రజలు సమ్మిట్ ను చూసేందుకు స్వచ్ఛందంగా తరలి రావాలని అధికారులు కోరారు.

Next Story